Share News

అయ్యప్పస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:16 AM

హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌ దర్శనం బుక్‌ చేసుకుంటున్నారు. కేరళ శబరిమలైలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

అయ్యప్పస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌
Sabarimala Online Booking

  • ఆన్‌లైన్‌లో టైమ్‌, స్లాట్‌ పొందే అవకాశం

  • 4-5 గంటల వ్యవధిలో దర్శనం

  • రెండు విడతల్లో ముందస్తు బుకింగ్‌

  • నవంబరు 30 నుంచి డిసెంబరు 24 వరకు..

  • డిసెంబరు 31 నుంచి జనవరి 12 వరకు..

  • మాలదారులు ఉపయోగించుకోవాలంటున్న గురుస్వాములు

భీమదేవరపల్లి(వరంగల్): హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌ దర్శనం బుక్‌ చేసుకుంటున్నారు. కేరళ శబరిమలైలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో మండల పూజ, మకరజ్యోతి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతీ రోజు స్వామి వారిని వేలాది మం ది భక్తులు బంగారు మెట్లను ఎక్కి, శరణుఘోషతో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం కోసం ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో స్వామి వారి దర్శనం కోసం 12 గంటలకు పైగానే భక్తులు వేచి చూడాల్సి వస్తోంది. భక్తుల రద్దీతో ప్రతి రోజు తొక్కిసలాటలు జరిగి ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ట్రావెన్‌కోన్‌ దేవస్థానం బోర్డు అయ్యప్ప ఆన్‌లైన్‌ దర్శన భాగ్యం కల్పిస్తుంది.


hnk2.3.jpgట్రావెన్‌కోన్‌ దేవస్థానం బోర్డు వెబ్‌సైట్‌..

శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులురైళ్లు, వాహనాలు, విమా నాల ద్వారా పంబాకు చేరుకుంటారు. భక్తులకు ట్రావెన్‌కోన్‌ దేవస్థానం బోర్డు ఇన్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తే శబరిమల ఆన్‌లైన్‌ ఓఆర్‌జీలింక్‌ వ స్తుంది. దీన్ని ప్రెస్‌ చేస్తే మనం ఏ రోజు, ఏ సమయంలో దర్శనం చేసుకుంటామో వివరాలు తెలిపితే ఆన్‌లైన్‌ దర్శనం రశీదులు వస్తాయి. ఈ రశీదులో దర్శనం చేసుకునే వారి పేరు, ఆధార్‌కార్డు, ఫొటో, అడ్రస్‌, రాష్ట్రం తదితర వివరాలతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పొందుతున్నారు. తద్వారా పంబాలో ఉన్న క్యూ కౌంటర్‌ వద్దకు వెళ్లి భక్తులు తీసుకున్న ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ను కేరళ పోలీసులకు చూపెడితే భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం లభిస్తుంది. ఆన్‌లైన్‌ దర్శనం రిజిస్ట్రేషన్‌ లేని భక్తులు 12గం టల పాటు వేచి చూస్తే అయ్యప్పస్వామి దర్శనం చేసుకుంటే రిజిస్ట్రేషన్‌ ఉన్న వారు మాత్రం 4-5గంటల లోపు దర్శనం చేసుకోవచ్చు. భక్తులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని గురుస్వాములు సూచిస్తున్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 24 వరకు, డిసెంబరు 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 12వరకు ఆన్‌లైన్‌ దర్శనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


hnk2.2.jpgఆన్‌లైన్‌ దర్శనం లేనివారికి ప్రత్యేక కౌంటర్‌..

ఆన్‌లైన్‌ దర్శనం చేయించుకోని భక్తులకు నీలాకల్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి దర్శనం కల్పించేందుకు దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ప్రతీరోజు 5 నుంచి 10 వేల మందికి టికెట్లు ఇచ్చి దర్శన భాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుంటే మంచిదని, లేని వారు కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా దర్శనం చేసుకోవచ్చని గురుస్వాములు పేర్కొంటున్నారు. పంబా నదిలో స్వాముల దీక్ష బట్టలు, వ్యర్థపదార్థాలు వేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని అక్కడి దేవాలయ బోర్డు ప్రచారం నిర్వహిస్తుంది. పవిత్రమైన పంబా నందిని కలుషితం చేయవద్దని గురుస్వాములు పేర్కొంటున్నారు.


ఆన్‌లైన్‌ దర్శనం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

  • కాసగోని భగత్‌సింగ్‌, గురుస్వామి, ముల్కనూర్‌

శబరిమలైలోని అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే మాలధారులు, భక్తులు ఆన్‌లైన్‌ దర్శనం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. దీని ద్వారా ఎంత మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నారనే విషయం నిర్వాహకులకు తెలుస్తోంది. వారికి తగ్గ ఏర్పాట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డు చేస్తుంది. ఒకేసారి లక్షలాది మంది భక్తులు వస్తే తొక్కిసలాట ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. ఈ విధానం తెలియని భక్తులు గురుస్వాములు, కంప్యూటర్‌ కేంద్రాల్లో వివరాలు తెలుసుకోవాలి.


ఆన్‌లైన్‌తో ఐదు గంటల్లో దర్శనం

  • జాన ప్రవీణ్‌, గురుస్వామి, రత్నగిరి

హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి ఆన్‌లైన్‌ దర్శనం ఐదు గంటల్లో పూర్తవుతుంది. స్వామి వా రి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుం చి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ లేకపోతే 12గంటల పాటు స్వామి వారి దర్శనం కోసం వేచి చూడాలి. భక్తులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి పంబా నది సమీపంలోని కేరళ పోలీ సు సహాయంతో వీలైనంత తొందరలోస్వామివారిని దర్శించుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ

న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 11:16 AM