మళ్లీ పెరుగుతున్న పత్తి ధరలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:43 AM
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మళ్లీ పత్తి ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పత్తి దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగింది.
క్వింటాకు రూ.9,209
నేడు వ్యవసాయ మార్కెట్ బంద్
మహబూబాబాద్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మళ్లీ పత్తి ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పత్తి దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగింది. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో అధిక ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆయా వ్యవసాయ మార్కెట్లలో పత్తిని అమ్ముకునేందుకుమొగ్గు చూపుతున్నారు. బుధవారం మహబూబాబాద్ మార్కెట్‌కు పర్వతగిరితండాకు చెందిన భూక్య బాలాజీ 35 బస్తాల పత్తిని అమ్మకానికి తీసుకురాగా, ఆయన పత్తి క్వింటాకు రూ.9209 గరిష్ట ధర పలికింది. ఇదే మార్కెట్లో కనిష్ట ధర రూ. 8526 ఉండగా సగటున రూ.9089 ధర పలికింది.
ఈ సీజన్లో ధరలు పెరగడం రెండోసారి. కేసముద్రం మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9009 ధర పలుకగా, కనిష్ట రూ.8239 పలికింది. ధర ల పెరుగుదలతో ఒక్కొక్క మార్కెట్‌కు వంద నుంచి 150 మంది రైతులు పత్తి ని తీసుకువస్తున్నారు. మార్కెట్లో సరుకులు అధికంగా రావడంతో జిల్లా మా ర్కెటింగ్ అధికారి జాల నరేందర్ మార్కెట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో ఆకాశంలో మబ్బులు చేసి చినుకులు పడడంతో మార్కెట్లో ఉన్న టార్పాలిన్లను ఆయన ఆధ్వర్యంలో రైతులకు అందించారు.
మార్కెట్‌కు నేడు సెలవు..
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకులు పేరుకుపోయినందు న ఓ కంపెనీలో పనిచేసే గుమస్తా అకాల మరణానికి సంతాప సూచికంగా గురువారం మార్కెట్ బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గమనించి మార్కెట్‌కు ఎలాంటి సరుకులు తీసుకురావోద్దని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ
న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా
Read Latest AP News And Telangana News And International News And Telugu News