గ్రీన్‌వాటర్ ట్యాంకర్లలో మురుగు నీరు
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:00 AM
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో అవకతవకలను సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తీవ్రంగా పరిగణించింది.
సీఎంసీలో ఇద్దరి సస్పెన్షన్
హైదరాబాద్ సిటీ: గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో అవకతవకలను సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తీవ్రంగా పరిగణించింది. నాలాల నుంచి నేరుగా మురుగునీటిని సరఫరా చేస్తున్నట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. శేరిలింగంపల్లి, నార్సింగ్, పటాన్‌చెరు సర్కిళ్ల మేనేజర్ విక్రమ్ చంద్ర, అవుట్ సోర్సింగ్ సూపర్‌వైజర్ గోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ రద్దు చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో శుద్ధి చేసిన మురుగు నీటిని పార్కులు, ల్యాండ్ స్కేపింగ్, భవన నిర్మాణాల కోసం వినియోగించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఆయా అవసరాలకు శుద్ధ జలాలను సరఫరా చేసేలా గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించగా.. కొందరు మురుగు నీటిని నేరుగా సరఫరా చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని నిర్ధారించుకున్న అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు సృజన తెలిపారు. నిర్ధేశిత మార్గదర్శకాలు అమలు చేయాలని, ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News