16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:56 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.
పశ్చిమగోదావరి జిల్లా, జూన్7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy).. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 2.60 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు.
ఐదేళ్లు డీఎస్సీ గురించి గొడ్డలి పార్టీ ఎందుకు ఊసెత్తలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం 16,300 ఉపాధ్యాయ నియమకాలు చేస్తే విషం కక్కుతోందని ఆగ్రహించారు. ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేని జగన్ నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపై చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News