Share News

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాబోతోంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 28 , 2026 | 02:35 PM

మహిళా రిజర్వేషన్ బిల్లు ఈనెల లేదా వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు రాబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి అద్భుత నగరంగా మారబోతుందని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రాబోతోంది: సీఎం చంద్రబాబు
AP CM CM Chandrababu Naidu

రాజమహేంద్రవరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల లేదా వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు రాబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అమరావతి అద్భుత నగరంగా మారబోతుందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) రాజమహేంద్రవరంలో సీఎం చంద్రబాబు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజమండ్రి నుంచి గొప్ప నాగరికత అభివృద్ధి చెందిందని ప్రస్తావించారు. వచ్చే ఏడాది వందేళ్ల కల పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతుందని వెల్లడించారు. గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయని చెప్పుకొచ్చారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గోదావరి పుష్కరాలకు రావాలి..

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గోదావరి పుష్కరాలకు రావాలని సీఎం ఆహ్వానించారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ గొప్ప న్యాయవాదులను అందించిందని తెలిపారు. ఫిబ్రవరి 2027 నాటికి ప్రభుత్వం నుంచి లిటిగేషన్లు లేకుండా చేసే కార్యక్రమాన్ని తీసుకున్నామని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ధన్యవాదాలు తెలిపారు. నాడు రాజధాని అమరావతిపై జస్టిస్ మిశ్రా చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రస్తావించారు. రాజమండ్రిలో ఫోక్సో కోర్టు ఏర్పాటుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 03:13 PM