Share News

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:50 PM

ప్రతి పౌరుడు తన వాణి వినిపించినప్పుడు, ప్రతి ప్రాంతానికి ప్రాతినిధ్యం లభించినప్పుడు, ప్రతి రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడు బలమైన ప్రజాస్వామ్యం నిర్మించగలమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడు తన వాణి వినిపించినప్పుడు, ప్రతి ప్రాంతానికి ప్రాతినిధ్యం లభించినప్పుడు, ప్రతి రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడు బలమైన ప్రజాస్వామ్యం నిర్మించగలమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో, కేంద్ర మంత్రులు అమిత్ షా , కిరణ్ రిజిజు చురుకైన పాత్రతో, భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని మరింత సమ్మిళితం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమైన సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తోందని ఉద్ఘాటించారు.


నవంబరు 30వ తేదీన జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ముందు ప్రతిపాదించిన డీలిమిటేషన్ సంస్కరణ,భారతదేశ ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి ముఖ్యమైన ముందడుగని పవన్ కల్యాణ్ తెలిపారు. 2051 వరకు అన్ని రాష్ట్రాల ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూనే, లోక్‌సభ సీట్లను 50శాతం పెంచాలనే ప్రతిపాదన, ప్రాతినిధ్యానికి మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని వెల్లడించారు. ఈ చట్టం జనాభా స్థిరీకరణలో దక్షిణ రాష్ట్రాల విజయాలను గుర్తిస్తూనే, పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో వాటి దామాషా వాటాను కూడా కాపాడుతుందని చెప్పుకొచ్చారు. ఇది సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.


లోక్‌సభ , రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ప్రతిపాదించిన 33% రిజర్వేషన్, శాసన సంస్థలలో నిర్ణయ - నిర్మాణంలో మహిళల భాగస్వామ్యానికి మరిన్ని అవకాశాలను కల్పించడం ద్వారా ఈ ప్రజాస్వామ్య సంస్కరణను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. జనసేనపార్టీ ఈ ముఖ్యమైన జాతీయ సంస్కరణకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ఏకమై, అందరూ తమ మద్దతును అందించాలని పవన్ కల్యాణ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 09:51 PM