Share News

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:45 PM

ఏపీలో నంది అవార్డుల సందడి మొదలుకానుంది. 2026 డిసెంబర్‌లో విజయవాడ/అమరావతిలో 2017–24, 2025 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Nandi Awards 2026

అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీలో నంది అవార్డుల సందడి మొదలుకానుంది. 2026 డిసెంబర్‌లో విజయవాడ/అమరావతిలో 2017–24, 2025 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అవార్డుల వేడుక ముందస్తు ఏర్పాట్ల కోసం ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీని (అంతర్-శాఖల కమిటీ) నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (I&PR) జీవో ఆర్టీ నంబర్ - 2202 జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ - ఎఫ్ఏసీ) ఎస్. సురేశ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వేడుకలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నోడల్ ఏజెన్సీగా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (AP Tourism Authority) సీఈఓ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ వేదిక ఖరారు, కార్యక్రమ షెడ్యూల్ రూపకల్పన, సినీ ప్రముఖులు, అవార్డు గ్రహీతలతో సమన్వయ బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.


వేదిక, సాంకేతిక ఏర్పాట్లు, ఆతిథ్యం, వసతి, రవాణా, ప్రోటోకాల్, భద్రత, ప్రచారం, మీడియా సమన్వయ పనులను ఈ కమిటీ సమగ్రంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన ఎంపానెల్డ్ ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీల సేవలను వినియోగించుకునేందుకు ఏపీ టూరిజం అథారిటీతో కమిటీ సమన్వయం చేయనుంది. జిల్లా యంత్రాంగం, ఇతర ప్రభుత్వ శాఖలు, సినీ పరిశ్రమ సంఘాలతో సమన్వయం చేసుకుంటూ, వేడుకలకు అయ్యే పూర్తి బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి కమిటీ ప్రతిపాదన చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి

టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ

నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 07:17 PM