Share News

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:34 PM

గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, 2026 ఉపసంహరణకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  పాత బిల్లు స్థానంలో కొత్తగా 'డీలిమిటేషన్ (రెండవ) బిల్లు, 2026' కేంద్రం తీసుకురానుంది. 

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
Delimitation Bill 2026

ఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, 2026 ఉపసంహరణకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  పాత బిల్లు స్థానంలో కొత్తగా 'డీలిమిటేషన్ (రెండవ) బిల్లు, 2026' కేంద్రం తీసుకురానుంది.  కొత్త బిల్లు కాపీని పార్లమెంట్ వెబ్‌సైటులో అందుబాటులో కేంద్రం ఉంచింది. మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం 'రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026' ప్రవేశపెట్టనుంది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 50 శాతం సీట్లు పెంచేలా కొత్త డీలిమిటేషన్ బిల్లులో కీలక నిబంధన విధించింది. 


లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న డీలిమిటేషన్ బిల్లు, 2026 ను ఉపసంహరించుకోవాలని మోదీ సర్కార్ కేంద్ర న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది.  కొత్తగా 'డీలిమిటేషన్ (రెండవ) బిల్లు, 2026' తో పాటు 'రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026' ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది.  ఆర్టికల్ 334A కింద మహిళలకు సీట్ల రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేసేందుకే కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది.  మొదటి డీలిమిటేషన్‌లోనే లోక్‌సభ, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీల సీట్లను 50శాతం పెంచే ప్రతిపాదనలను చేయనుంది. 


సీట్ల 50శాతం పెరుగుదల వల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం కలగదని మోదీ సర్కార్ స్పష్టం చేసింది.  తాజా జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల విభజన జరిగేలా కొత్త బిల్లులో మార్పులు చేసినట్లు తెలిపింది.  మహిళలకు రిజర్వ్ చేసే సీట్లను డీలిమిటేషన్ కమిషన్ రోటేషన్ పద్ధతిలో కేటాయించేలా నిబంధన విధించింది.  ఏప్రిల్‌లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో పాత బిల్లు ప్రక్రియ నిలిచిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 09:54 PM