Share News

వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్: రఘురామ

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:53 PM

వినాయకుని నిమజ్జనాల్లో డీజే పర్మిషన్ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కొంతమంది యువకులు ఆదివారం కలిశారు. అయితే, ఉండి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్:  రఘురామ
AP Assembly Deputy Speaker Raghurama Krishnam Raju

పశ్చిమగోదావరి జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): వినాయకుని నిమజ్జనాల్లో డీజే పర్మిషన్ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును (Raghurama Krishnam Raju) కొంతమంది యువకులు ఈరోజు (ఆదివారం) కలిశారు. అయితే, ఉండి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రజ్యోతి పేపర్‌ను ఆ యువకులకు ఇచ్చి ‘డీజే సౌండ్స్‌కు ఆగిన గుండె’ కథనాన్ని రఘురామ చదివించారు.


ఈ క్రమంలో డీజే సౌండ్స్ లేకుండా వినాయక చవితి నిమజ్జనం చేసుకుంటామని యువకులు తెలిపారు. డీజే సౌండ్స్‌కు ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. సౌండ్ పొల్యూషన్ లేకుండా వినాయక నిమజ్జనాలు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 01:21 PM