Share News

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు: శ్రీనివాసవర్మ

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:57 AM

నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కీలక మైలురాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అభివర్ణించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు: శ్రీనివాసవర్మ
Union Minister Srinivasa Varma

విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కీలక మైలురాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Union Minister Srinivasa Varma) అభివర్ణించారు. ఈ విమానాశ్రాయం ప్రారంభం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు ఇదని పేర్కొన్నారు. ఈ రోజు (శనివారం) భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మ మాట్లాడారు.


ఉడాన్ పథకంతో దేశ విమానయాన రూపురేఖలు మారాయి..

ఏపీ అభివృద్ధిని ప్రధాని మోదీ తన భుజాలపై ఎత్తుకున్నారని శ్రీనివాసవర్మ ప్రశంసించారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేయొచ్చని తెలిపారు. మోదీ వచ్చాక విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని వివరించారు. సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయాలనేది ప్రధాని సంకల్పమని చెప్పుకొచ్చారు. విమాన ప్రయాణం అంటే గతంలో డబ్బు ఉన్న వాళ్లకే సాధ్యమయ్యేదని అన్నారు. ఉడాన్ పథకంతో దేశ విమానయాన రూపురేఖలు మారాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 12:11 PM