Share News

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీలో చేరా: మజ్జి శ్రీనివాసరావు

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:55 PM

తెలుగుదేశం పార్టీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేరారు. మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీలో చేరా: మజ్జి శ్రీనివాసరావు
Majji Sreenivasa Rao

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమక్షంలో వారు టీడీపీలో చేరారు. ఇప్పటికే వైసీపీకి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవితోపాటు.. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి చిన్న శ్రీను రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

MAJJI-SRINU--3jpg.jpg


ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీలో చేరా: శ్రీనివాసరావు

ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తాను, తన కూతురు చేరినట్లు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం తనను ఆకర్షించడంతో తెలుగుదేశం పార్టీలో చేరానని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాను భాగస్వామిని కావాలనే ఆశయంతో టీడీపీలో జాయిన్ అయ్యానని వివరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నానని చెప్పారు. విజయనగరం జిల్లాలో అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలనే టీడీపీలో చేరానని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

MAJJI-SRINU-3.jpgMAJJI-SRINU.jpg

MAJJI-SRINU-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 09:26 PM