Share News

అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:37 PM

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీ కీలక నేతలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీలు వీసం నానాజీ, వీసం దేవి పసుపు కండువాలు కప్పుకున్నారు.

అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతలు
YSRCP Leaders Join TDP

అనకాపల్లి జిల్లా, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీ కీలక నేతలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీలు వీసం నానాజీ, వీసం దేవి పసుపు కండువాలు కప్పుకున్నారు.


నక్కపల్లి మండలం పెదబోదుగాలం గ్రామం నుంచి ఎంపీటీసీగా వీసం నానాజీ గెలుపొందిన విషయం తెలిసిందే. రేబాక గ్రామం నుంచి ఎంపీటీసీగా వీసం దేవి విజయం సాధించారు. నక్కపల్లిలోని హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద వీరితో పాటు పలువురు టీడీపీలో జాయిన్ అయ్యారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా హోంమంత్రి అనిత ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 01:06 PM