అత్యాధునిక పరికరాలతో అగ్నిమాపక సేవలు బలోపేతం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:16 PM
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో డెమోలో అధికారులు వివరించారుని తెలిపారు. ఈరోజు(శనివారం) జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు.
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా ఫైర్ సర్వీస్ డెమో ఆకట్టుకుంది. మెగా ఫైర్ సర్వీస్ డెమోను అతిథులు, నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పోషించే అమూల్యమైన పాత్రను అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను హోం మంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడారు.
2018లో అగ్నిమాపక శాఖకు పరికరాలు కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు అగ్నిమాపక శాఖను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల రూ. 232 కోట్లతో ఫైర్ వెహికల్స్ కొనుగోలు చేశామని ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు ఈ వాహనాలను కూడా ప్రారంభించారని అన్నారు. అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నామని వివరించారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ, డ్రోన్లు వాడుతున్నామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్
నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News