ఆ పోస్టులను భర్తీ చేస్తాం.. మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:07 PM
గడిచిన మూడేళ్లుగా త్వరితగతిన కారుణ్య నియామకాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గడిచిన మూడేళ్లుగా త్వరితగతిన కారుణ్య నియామకాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (AP Minister Gottipati Ravi Kumar) స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈరోజు (సోమవారం) ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 43 మంది ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఈపీడీసీఎల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.
విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి..
సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖలోకి తీసుకున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు విద్యుత్ శాఖపై ప్రత్యేక దృష్టి ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న లైన్‌మన్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యుత్ వినియోగంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తు విద్యుత్ శాఖలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం కరెంట్ బిల్లు పెంచలేదని.. విద్యుత్ బిల్లు పెంచకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ఉద్యోగులు విధుల్లో జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ శాఖకు పూర్తి సహాయ, సహకారం అందిస్తాం: పల్లా శ్రీనివాసరావు
కష్టంలో ఉన్నవారికి ఆసరా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు కారుణ్య నియామకాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చి కారుణ్య నియామక పత్రాలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యుత్ శాఖ అవసరం హుద్ హుద్ సమయంలో బాగా కనిపించిందని తెలిపారు. విద్యుత్ శాఖకు తాము పూర్తి సహాయ, సహకారం అందిస్తామని మాటిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం బాధ్యతగా చేయాలని సూచించారు. అధికారులు కష్టపడి పని చేయాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
విద్యుత్‌ను ఆదా చేసుకోవాలి: ఎంపీ శ్రీభరత్
ఉద్యోగాలు పొందినవారు వృత్తికి, కుటుంబానికి న్యాయం చేయాలని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసుకోవాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News