Share News

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - May 22 , 2026 | 12:08 PM

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..
Summer Special Trains

చెన్నై: వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా..

  • నెం.06075 తాంబరం-సంత్రాగచ్చి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 26, మే 2వ తేదీల్లో తాంబరం నుంచి ఉదయం 10.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. మరుమార్గంలో, నెం.06076 సంత్రాగచ్చి-తాంబరం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 27, జూన్‌ 3వ తేదీల్లో సంత్రాగచ్చిలో రాత్రి 9.30గంటలకు బయల్దేరి మూడోరోజు ఉదయం 10.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈరైళ్లు చెన్నై ఎగ్మూర్‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు మీదుగా నడుస్తాయి. ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్‌ శుక్రవారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని దక్షిణ రైల్వే తెలిపింది.


nani1.2.jpg

  • నెం.06059 తాంబరం-బోడినాయకనూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23,30, జూన్‌ 6,13 తేదీల్లో తాంబం నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు బోడినాయకనూరు చేరుకుంటుంది. మరుమార్గంలో, నెం.06060 బోడినాయకనూరు-తాంబరం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24,31, జూన్‌ 7,14 తేదీల్లో బోడినాయకనూరు నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.


zzzz.jpgఈ వార్తలు కూడా చదవండి:

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

చేదెక్కిన మామిడి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 12:08 PM