చేదెక్కిన మామిడి..
ABN , Publish Date - May 22 , 2026 | 10:48 AM
రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.
ధర పాతాళం - దిగుబడి శూన్యం
పెరిగిన పెట్టబడులు
రైతులను ముంచుతున్న వ్యాపారులు
రాయచోటి(అన్నమయ్య): రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి సరఫరా చేస్తారు. రోజు వందల సంఖ్య లో వాహనాలు తరలి వెళ్తాయి. ఐదేళ్లగా మామి డి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధర ఉంటే దిగుబడి ఉండదు, దిగుబడి ఉంటే ధర ఉండదు, ఈ ఏడాది మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. మామిడి రైతు ఇంట కష్టాలు, కంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్కెట్‌లో దిగుబడి ఉంటే ధర ఉండదు, ధర ఉంటే దిగుబడి ఉండదు. అయితే ఇప్పుడు మామిడిలో ధర లేదు దిగుబడి లేదు.
మామిడి రైతుకు ఆశా నిరాశలే...మిగిలాయి... చేతికందిన దిగుబడి మార్కెట్‌కి తరలిస్తే రైతులను వ్యాపారి నిలువునా ముంచుతున్నాడు. తీసుకునే సమ యంలో చెప్పిన ధరకు చివరికి డబ్బు ఇచ్చే సమ యంలో రైతు చేతికందేది మరో ధర. దీంతో ఆరుగాలం శ్రమించే మామిడి రైతుకు దిగుబడి వచ్చి నా రాకపోయినా కష్టాలు, నష్టాలు, తప్పడం లేదు. నీడ పాటున కూర్చుని మార్కెట్ చేసే వ్యా పారికి మాత్రం లాభాలపైన లాభాలు వస్తున్నా యి. కమిషన్, లేబర్, జాక్పాట్, తరుగు, చాటను అంటాడు, ఇలా ప్రతి ఒక్కదానిపై కోత పెట్టి సొ మ్ము చేసుకునే వ్యాపారి బాగుపడుతున్నాడు.
పెరిగిన పెట్టుబడులు
ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులను పట్టిపీడిస్తున్నాయి. దీంతో సస్యరక్షణ చర్యలు మామిడి రైతుల పాలిట అదనపు పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో ఒకటి రెండుసార్లు సస్యరక్షణ చర్యలు చేపట్టేవారు. అయితే బంక తెగుళ్లు, మం గు తెగుళ్లు, పురుగుల బెడదతో ప్రతి రైతు నాలుగు నుంచి ఐదు సార్లు సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సివస్తోంది. ఎకరాకు 60 చెట్లు చొప్పున ఒక చెట్టుకు పది నుంచి 15 లీటర్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన ఎకరాకు 900 నుంచి 1000లీటర్ల పిచికారీ చేయాల్సి వస్తోంది. దీనికి మందులకు సుమారు రూ.3వేలు నుంచి రూ3,500లు ఖర్చు వస్తోంది. ఇది ఇలా ఎకరాకు మూడు, నాలుగు సార్లు సస్యరక్షణకు రూ.12వేలు నుంచి రూ.15వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో మామిడి రైతులపై అదనపు భారం పడిందనే చెప్పవచ్చు.
కుదేలైన ధరలు...
మార్కెట్‌లో మామిడి ధరలు ఒకసారిగా కుదేలయ్యాయి. మామిడిలో బెనిషారకం టన్ను రూ.40 వేలు నుంచి రూ.45వేలు ఉండేది. అయితే ప్రస్తు తం రూ.25వేలు నుంచి రూ.30వేలు పడిపోయిం ది. లాల్‌బార్ టన్ను రూ.25వేలు రూ.30వేలు ఉండేది. ప్రస్తుతం రూ.15వేలు నుంచి రూ.18 వేలు పడిపోయింది. బెంగళూరుకు రకం మామి డి టన్ను రూ.12 వేలు నుంచి రూ.15వేలు ఉండే ది. ప్రస్త్తుతం రూ.5వేలు నుంచి రూ.6వేలు పడిపోయింది. ఖాదర్ రకం టన్ను మామిడి రూ.45 వేలు నుంచి రూ.60వేలు ఉండేది. ప్రస్తుతం రూ.30వేలు నుంచి రూ.35వేలకు పడిపోయింది. ఇలా ఇమామ్ పసందు వివిధ మామి డి రకాలు ధరలు పూర్తిగా పడిపోవడంతో రైతుకు అరకొర దిగుబడి వచ్చిన ఖర్చులు పెరిగి నష్టాలు తప్పడం లేదు.
వ్యాపారి చెప్పిందే ధర....
రాయచోటి మార్కెట్‌లో దళారులు, చెప్పింది. ధర రైతుకు చెప్పే ధర ఒకటి తీరా మార్కెట్ కి వచ్చి న తరువాత ధర మరొకటి ఇస్తారు. రైతు స్వతంత్రంగా ధర చెప్పే హక్కు కూడా లేని పరిస్థితి. రాయచోటి వ్యాపారులే చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సుండుపల్లి, వివిధ ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసి మామిడి కాయలను రైతుల నుంచి కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారు. వీరిని ప్రశ్నించే నాథుడే లేరు. వీరి నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ధర తగ్గించి ఇచ్చారు
మామిడితోట వద్దకు వచ్చిన వ్యాపారి లోడు కాయలు చూసి రాయచోటిలో 1వ మండి హాజీ సయ్యద్ మగ్బుల్ మండి కొస్తే బేనిషా టన్ను రూ.30వేలు లాల్‌బార్ టన్ను రూ.15వేలు పట్టీ కట్టి డబ్బు ఇచ్చినట్లు తెలిపారు. ఇదేమి దగా అని అడిగితే మంగు వచ్చాయని, ఇంతే అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు, ప్రభుత్వం వ్యాపారులపై చర్యలు తీసుకుని రైతులను కాపాడాలని కోరారు.
సూర్యనారాయణరెడ్డి, మామిడి రైతు, పందిళ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం
ఈ వార్తలు కూడా చదవండి:
కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News