కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్
ABN , Publish Date - May 22 , 2026 | 09:07 AM
డీలిమిటేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు..
అమరావతి, మే 22: డీలిమిటేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం.. 1971 జనగణన ఆధారంగా లోక్‌సభ సీట్ల కేటాయింపు నిలిపివేశారని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 2026 తర్వాత నిర్వహించే జనగణనతో ఈ ఫ్రీజ్ ముగుస్తుందని తెలిపారు. దీంతో సీట్ల పునర్విభజన తప్పనిసరి అవుతుందన్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు.
ఇదే సమస్యను తమ పార్టీ ఎప్పటినుంచో ప్రస్తావిస్తోందని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు.
2026 జనగణన తర్వాత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఏం చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇటీవల ఆంగ్ల పత్రికకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిదంబరం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎలాంటి మార్పు చేయకుండా పునర్విభజన చేపడితే.. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల బలం లోక్‌సభలో తగ్గిపోతుందన్నారు.
దీని వల్ల కేవలం ఉత్తరాది రాష్ట్రాలే లబ్ధి పొందుతాయని చిదంబరం చెప్పారు. అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించి.. ఓడించాయని చిదంబరం స్పష్టం చేశారు. దీనికి కౌంటర్‌గా నారా లోకేశ్ శుక్రవారం స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు
కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !
For AP News And Telugu News