Share News

అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు

ABN , Publish Date - May 22 , 2026 | 07:38 AM

విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు

విజయవాడ, మే 22: విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటూ హల్‌చల్ చేశారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పవన్ కిషోర్ అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్

అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు

For AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 10:22 AM