Share News

జుట్టుకు పెరుగు రాయడం మంచిదేనా?

ABN , Publish Date - May 22 , 2026 | 10:11 AM

మారుతున్న జీవనశైలి, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఖరీదైన ట్రీట్‌మెంట్‌లకు బదులుగా ఇంట్లోనే లభించే పెరుగును జుట్టుకు రాయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జుట్టుకు పెరుగు రాయడం మంచిదేనా?
Curd for Hair Growth

ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న జీవనశైలి, పోషకాహారం లోపం, దుమ్ము, కాలుష్యం, అలాగే రసాయన ఉత్పత్తుల అధిక వాడకం వల్ల జుట్టు బలహీనపడుతోంది. దీంతో చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పలుచబడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఖరీదైన షాంపూలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంట్లో సులభంగా దొరికే పెరుగును తలస్నానం చేసే ముందు జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ B5, మంచి బ్యాక్టీరియా వంటి పోషకాలు ఉంటాయి. ఇవి తల చర్మానికి పోషణ అందించి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. అలాగే తల చర్మానికి తేమను అందించి పొడిబారడం, చుండ్రు తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగు జుట్టును సహజంగా మృదువుగా, మెరిసేలా చేస్తుంది.


జుట్టుకు పెరుగు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు

తల చర్మాన్ని శుభ్రపరుస్తుంది:

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తల చర్మంలోని మురికి, చెమట, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో తల చర్మం శుభ్రంగా ఉండి జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

జుట్టు బలంగా మారుతుంది:

పెరుగులోని ప్రొటీన్లు, విటమిన్లు జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి జుట్టు విరిగిపోవడాన్ని తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.


చుండ్రు, దురద తగ్గుతుంది:

తలలో చుండ్రు, దురద సమస్య ఉంటే పెరుగును కొంతసేపు తలకు పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తల చికాకును తగ్గిస్తాయి. పెరుగు జుట్టును మృదువుగా చేస్తుంది. తరచూ వాడితే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

జుట్టుకు పెరుగు ఎలా ఉపయోగించాలి?

ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకుని, కావాలంటే కొద్దిగా కలబంద జెల్ లేదా మెంతుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మానికి, జుట్టుకు బాగా పట్టించి 20 నుంచి 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అవసరమైతే తేలికపాటి షాంపూ ఉపయోగించవచ్చు. అయితే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణమై ఉండొచ్చు. అలాంటి సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Updated Date - May 22 , 2026 | 10:25 AM