Share News

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

ABN , Publish Date - May 18 , 2026 | 11:04 AM

సిగరెట్లు తాగకపోయినా చాలా మందికి పెదాలు నల్లగా మారుతుంటాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో పెదాల నల్లదనాన్ని తగ్గించి సహజమైన గులాబీ రంగును తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
Dark Lips Remedies

ఇంటర్నెట్ డెస్క్: చాలామందికి సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా మారిపోతుంటాయి. దీంతో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు. పెదాలు నల్లబడటానికి సిగరెట్లు మాత్రమే కారణం కాదు. ఎండలో ఎక్కువగా తిరగడం, శరీరంలో నీటి కొరత, ఎక్కువ టీ లేదా కాఫీ తాగడం, నాణ్యతలేని లిప్‌స్టిక్‌లు వాడటం వంటి కారణాలు కూడా ఉండొచ్చు. అయితే, ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో పెదాలను మళ్లీ సహజమైన గులాబీ రంగులోకి తీసుకురావచ్చు.


నల్లటి పెదాలకు ఇంటి చిట్కాలు

  • తేనె – నిమ్మరసం: ఒక చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి పెదవులకు రాయాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పెదాల నల్లదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

  • షుగర్ స్క్రబ్: కొద్దిగా చక్కెరలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి పెదాలపై మెల్లగా రుద్దాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పెదాలు మృదువుగా మారుతాయి.

  • బీట్‌రూట్ జ్యూస్: రాత్రి పడుకునే ముందు బీట్‌రూట్ జ్యూస్‌ను పెదవులకు రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇది సహజమైన గులాబీ రంగును ఇవ్వడంలో సహాయపడుతుంది.

  • కొబ్బరి నూనె: పెదాలు పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకొని, సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇది పెదాలను తేమగా ఉంచి నల్లటి మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.


పాటించాల్సిన జాగ్రత్తలు

  • రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

  • బయటకు వెళ్లే ముందు SPF(Sun Protection Factor) ఉన్న లిప్‌బామ్ వాడాలి.

  • రాత్రి పడుకునే ముందు లిప్‌స్టిక్ పూర్తిగా తొలగించాలి.

  • పెదాలను నాలుకతో తడపడం మానేయాలి.

  • పెదాలు ఒక్కసారిగా చాలా నల్లగా మారినా, దురద లేదా వాపు వచ్చినా వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పెదాలు మృదువుగా, అందంగా కనిపిస్తాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

జెన్ Z 'స్లో ట్రావెల్' ట్రెండ్.. లగ్జరీ కంటే లోకల్ లైఫ్‌కే ప్రాధాన్యం

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఐస్‌క్రీమ్ తినకపోవడమే మంచిది!

For More Latest News

Updated Date - May 18 , 2026 | 11:15 AM