రోజంతా డబ్బు గురించే ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ABN , Publish Date - May 16 , 2026 | 11:22 AM
డబ్బు జీవితం కోసం అవసరమే అయినప్పటికీ, దాని గురించే రోజంతా ఆలోచించడం మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బుపై మితిమీరిన వ్యామోహం ఆరోగ్యం, ఆధ్యాత్మికతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బు మన జీవితంలో అవసరమే. కానీ డబ్బు గురించే రోజంతా ఆలోచిస్తూ ఉండటం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ధనం కోసం ఆరాటపడటం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. అనైతిక మార్గాల్లో సంపాదించే డబ్బు మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అలాంటి సంపాదన వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డబ్బుపై అధిక ఆలోచనలు కలిగించే ప్రభావాలు
మానసిక ఒత్తిడి పెరుగుతుంది
కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి
సంతోషం తగ్గిపోతుంది
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
జీవితంలో ప్రశాంతత తగ్గుతుంది.
ఈ సమయాల్లో డబ్బు గురించి ఆలోచించకూడదు
శాస్త్రాల ప్రకారం కొన్ని సమయాల్లో డబ్బు, ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తం అయిన ఉదయం పూట, అలాగే సూర్యాస్తమయం తర్వాత డబ్బు గురించి అధికంగా చింతించకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆర్థిక విషయాలు, వ్యాపార నిర్ణయాలు లేదా డబ్బుకు సంబంధించిన పనులు చేయడానికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుకూల సమయమని నిపుణులు పేర్కొన్నారు. డబ్బు అవసరం అయినప్పటికీ, అవసరానికి తగ్గట్టు జీవించడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News