Share News

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - May 22 , 2026 | 09:59 AM

వేసవి కాలంలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత శశిధర రెడ్డి సూచించారు.

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
Kidney Problems

తిరుపతి: వేసవి కాలంలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత శశిధర రెడ్డి సూచించారు. కిడ్నీ సమస్యకు గురైతే వెంటనే సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించడం మంచిదన్నారు. అయితే ఆర్థిక స్థోమత లేదని ఎవరూ మెరుగైన వైద్యానికి దూరం కాకూడదన్న శశిధర రెడ్డి కిడ్నీలో రాళ్ళు, మూత్ర సంబంధిత సమస్యలకు రమాదేవి ఆస్పత్రిలో లేజర్‌, ఈఎ్‌సడబ్యుఎల్‌, రిర్స్‌ లేజర్‌, కీ హోల్‌ సర్జరీలు అందుబాటులో వున్నాయని తెలిపారు. ప్రభుత్వ, కార్పొరేట్‌ పథకాల ద్వారా 100 శాతం ఉచిత, నగదురహిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఉచిత సేవల్లో రక్త పరీక్షలు, అలా్ట్ర సౌండ్‌, సీటీ స్కాన్‌,వివిధ రకాల సర్జరీలు, ఇంప్లాంట్స్‌, స్టెంట్‌, రూము చార్జీలు, భోజనం వున్నాయని చెప్పారు. అపాయింట్‌మెంట్‌ కోసం 24 గంటలూ హెల్ప్‌ లైన్‌ నెంబరు 9849677970లో సంప్రదించవచ్చన్నారు.


city4.2.jpgనిర్లక్ష్యం చేస్తే మందగించే కిడ్నీ పనితీరు

ఎండాకాలం శరీరంలో లవణాల హెచ్చు తగ్గులతో పాటు సోడియం తగ్గిపోయి పొటాషియం స్థాయులు పెరుగుతాయని, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పనితీరు మందగిస్తుందని రమాదేవి ఆస్పత్రి యూరాలజీ డాక్టర్‌ రాజేష్‏రెడ్డి తెలిపారు. వాతావరణంలో వేడి గాలులు, ఎండ బాగా పెరిగిపోతుండడంతో శరీరంలో నీరు తగ్గిపోయి తలనొప్పి, ప్లూయిడ్‌లు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సాధారణంగా వచ్చే మూత్రం కన్నా క్రియాటిన్‌ పెరిగినప్పుడు తగ్గుతుందన్నారు.


యూరిన్‌ ముదురు రంగులో పడడం, కాళ్ళు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు రావడం, అలసట, నడుము నొప్పి, శరీరంలో నీరు చేరినట్లు లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఇటువంటి సమయంలో తగినంత నీరు తాగడం, ఎలక్ర్టోలైట్స్‌ ద్వారా సమతుల్యత కాపాడుకోవడం,ప్రాధమిక దశలోనే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని తెలిపారు. వేసవి కాలంలో రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలన్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నారులు, గర్భిణులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం ఉత్తమమని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 09:59 AM