Share News

హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ

ABN , Publish Date - May 22 , 2026 | 08:32 AM

గత కొంతకాలంగా ఈడీ కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ
Nowhera Shaik Arrest

హైదరాబాద్, మే 22: కొంతకాలంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్‌లో తల దాచుకున్న నౌహీరాను టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఈడీ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్ట్ చేసిన నౌహీరాను శుక్రవారం గుర్గావ్ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు నౌహీరాను వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నౌహీరా షేక్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అప్పటి నుంచి నౌహీరా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నౌహీరా షేక్ గుర్గావ్‌లో నకిలీ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఈడీ విచారణలో తేలింది.


తనపై జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కొద్ది రోజుల్లోనే, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె గుర్గావ్‌లో ఉన్నట్లు ఈడీ పక్కాగా గుర్తించి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 10:20 AM