Share News

ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం

ABN , Publish Date - May 22 , 2026 | 11:29 AM

బక్రీద్‌ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై పేర్కొన్నారు.

ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం
Bakrid, Madanapalle, Andhrapradesh

మదనపల్లె(చిత్తూరు): బక్రీద్‌ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పశుసంవర్థకశాఖ ఏడీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చూలు పశువులను, మూడు నెలల లోపు దూడలను, పశువైద్యుల ధృవీకరణ లేని వాటిని వధించకూడదన్నారు. గోవులను, ఒంటెలను వధించకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పీసీఏ యాక్ట్‌ 1960 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


tpt3.jpg

zzz.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

చేదెక్కిన మామిడి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 11:29 AM