శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
ABN , Publish Date - May 22 , 2026 | 10:58 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి గాంజా స్మగ్లింగ్ యత్నం బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 10 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్, మే 22: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(శంషాబాద్) మరోసారి గాంజా స్మగ్లింగ్ యత్నం బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 10 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గాంజా స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. లగేజీ బ్యాగ్ కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లలో గాంజాను దాచి తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. స్కానింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో లగేజీని తనిఖీ చేయగా గాంజా స్మగ్లింగ్ ఉదంతం బయటపడింది. అధికారులు గాంజాను స్వాధీనం చేసుకుని.. నిందితుడిని ముమ్మరంగా విచారిస్తున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కొన్ని నెలలుగా డ్రగ్ స్మగ్లింగ్‌కు హాట్ స్పాట్‌గా మారింది. బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాల నుంచి గాంజా తరలింపు యత్నాలు తరచుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో 13.2 కేజీల గాంజా పట్టుబడగా.. ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈనెలలో(మే నెల) రెండు సందర్భాల్లో 8.7 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులు బాటిళ్లు, స్నాక్స్ టిన్లలో గాంజాను దాచినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్
Read Latest Telangana News And Telugu News