Share News

నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్

ABN , Publish Date - May 22 , 2026 | 09:47 AM

నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్‌ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు, జవహర్‌నగర్, కాచిగూడ కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీలను అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.

నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్
Hyderabad News

హైదరాబాద్, మే 22: నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్‌ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు, జవహర్‌నగర్, కాచిగూడ కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీలను అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో మొత్తం 20 మంది అధికారులు, సిబ్బంది ఉంటారు. ఈ బృందంలో ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు ఎస్‌ఐలు, 17 మంది కానిస్టేబుల్స్ ఉండనుండగా.. ICCC ఐటీ సెల్ నుంచి సిట్ పని చేయనుంది.


నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని గుర్తించి, వారందరినీ అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సిట్ పనిచేయనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక కేసులకు సంబంధించి నేపాలీల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉండటంతో పోలీసు యంత్రాంగం ఈ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి...

హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ

అనంతబాబు కేసులో ఇద్దరి వాంగ్మూలాలు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2026 | 09:47 AM