ఏసీ శాంతికి మధ్యంతర బెయిల్
ABN , Publish Date - May 22 , 2026 | 06:18 AM
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతికి స్వల్ప ఉపశమనం లభించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న..
ఈ నెల 23-27 వరకు మంజూరు
విజయవాడ, మే 21(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతికి స్వల్ప ఉపశమనం లభించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి 27 వరకు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శాంతి ఇప్పటి వరకు రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని కోర్టు కొట్టేసింది.