Share News

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - May 22 , 2026 | 10:35 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
Rajanna Sircilla News

రాజన్న సిరిసిల్ల జిల్లా, మే 22: తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఐదుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈత కొట్టేందుకు మిడ్ మానేరులోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. మృతులు సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్(18), చిర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మణికంఠకు ఈత రాదు. అతడు నీటిలో కొట్టుకుపోతుండగా స్నేహితుడైన హరిచరణ్ గౌడ్‌ను పట్టుకున్నాడు.


స్నేహితుడిని రక్షించేందుకు హరిచరణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఇద్దరూ కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు యువకులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.


ఇవి కూడా చదవండి...

అనంతబాబు కేసులో ఇద్దరి వాంగ్మూలాలు నమోదు

నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2026 | 10:37 AM