ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
ABN , First Publish Date - 2023-05-22T23:47:45+05:30 IST
వేసవి సెలవులు ఆనందంగా గడపడానికి బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లల ప్రాణాలను ఈత సరదా బలి తీసుకుంది. అనంతపురం జిల్లా శింగనమల మండ లం పెద్ద జలాలపురం గ్రామంలో సోమవారం సాయంత్రం జరి గిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్రవిషాదాన్ని నింపింది.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన
శింగనమల, మే 22: వేసవి సెలవులు ఆనందంగా గడపడానికి బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లల ప్రాణాలను ఈత సరదా బలి తీసుకుంది. అనంతపురం జిల్లా శింగనమల మండ లం పెద్ద జలాలపురం గ్రామంలో సోమవారం సాయంత్రం జరి గిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్రవిషాదాన్ని నింపింది. కడప జిల్లా కొండాపురం మండలం ధర్మాల గ్రామానికి చెందిన సరస్వతి, తన కుమారుడు బాలు(16), ఆమె అన్న నారాయణ కుమారుడు హేమాద్రి(10)తో కలిసి పెద్ద జలాలపురం గ్రామం లో ఉంటున్న తన చెల్లెలు (భర్త గొల్ల రామచంద్ర) ఇంటికి రెండు రోజుల కిందట వచ్చింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో దుస్తులు ఉతకడానికి గ్రామ సమీపంలోని కూతలేరు వంకలోకి సరస్వతి మరో మహిళతో కలిసి వెళ్లింది. వారి వెంట బాలు, హేమాద్రి కూడా వెళ్లారు. ఈత కొట్టడానికి ఇద్దరు చిన్నారులు వంకలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండ టంతో హేమాద్రి మునిగిపోయాడు. అతన్ని రక్షించేందుకు బాలు వెళ్లాడు. అయితే నీటిలోతు ఎక్కువ ఉండటంతో ఇద్దరూ ముని గిపోయారు. గట్టున ఉన్న మహిళలు పెద్ద ఎత్తున కేకలు వేయ డంతో అటుగా వెళ్తున్న వారు వచ్చి నీటి అడుగున ఉన్న చిన్నా రులను బయటికి తీశారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. సరాదగా నీటిలో ఈత కొడుతున్న ఇద్దరు పిల్లులు మృతి చెంద డంతోవారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. చిన్నా రుల మృతదేహాలను స్వగ్రామం ధర్మాలకు తరలించారు. గత విద్యాసంవత్సరంలో బాలు తొమ్మిదో తరగతి, హేమాద్రి నాలుగో తరగతి పూర్తి చేశారు.