ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్
ABN , Publish Date - May 22 , 2026 | 11:47 AM
తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
హైదరాబాద్, మే 22: తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అబద్ధాలతో సీఎం రేవంత్ పాలనను నెట్టుకొస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలో నలుగురు రైతులు చనిపోయారని.. కానీ ఒక్కరైతు కూడా చనిపోలేదని మంత్రులు మాట్లాడటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు 35శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మాజీ మంత్రి విమర్శించారు. రైతులే కాదు.. కాంగ్రెస్ కార్యకర్తలూ ధర్నా చేస్తున్నారని తెలిపారు. నిన్న(గురువారం) సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా రైతులు ధర్నా చేశారని అన్నారు. సంక్షోభాన్ని గుర్తించకుండా సీఎం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ప్రణాళిక లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News