బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు
ABN , Publish Date - May 22 , 2026 | 11:35 AM
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.
హైదరాబాద్, మే 22: బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి.. కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని వెల్లడించారు. ఫార్మా సిటీని కొనసాగిస్తామని ఓ వైపు కోర్టుకు చెబుతూ.. రేవంత్ ప్రభుత్వం జిమ్మిక్కు చేస్తోందని విమర్శించారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 75శాతం ఫార్మా సిటీ ఉండి... మిగతా 25శాతం మిగతావి ఉండాలని అన్నారు. కానీ..75శాతం మిగతా వ్యాపారం చేసి.. కేవలం 25శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారని విమర్శించారు. ఇది చట్ట ప్రకారం చెల్లదన్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని.. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామని స్పష్టం చేశారు. ‘ఇది నా మాట కాదు.. పార్లమెంట్ చట్టం. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ధి పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్‌కు పేరు వస్తుందని ఇలా చేశారు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News