సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్
ABN , Publish Date - May 22 , 2026 | 11:51 AM
డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్‌స్కేప్‌లో జరిగిన ఈ వేడుక రెండు వేలకుపైగా జనంతో సందడిగా సాగింది. వెండర్ బూత్‌లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలతో పిల్లలు, యువత థ్రిల్ ఫీలయ్యారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ స్ప్రింగ్ ఫెస్ట్‌ను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు.
గ్రాండ్ స్కేప్‌లో ఫుడ్ స్టాల్స్, ఐస్‌క్రీమ్ షాపులు ప్రత్యేకంగా కనిపించాయి. పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది.

జాతీయ గీతాలతో ప్రారంభం
అమెరికా, భారత జాతీయ గీతాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) స్వాగతం పలికారు. యాంకర్ వీణ యలమంచిలి కార్యక్రమాన్ని షోను రన్ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్ప్రింగ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:
అట్లాంటాలో తానా వాలీబాల్ టోర్నమెంట్
ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి