మత్స్యకారుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు నేను ఎప్పుడూ చేయలేదు: ఎంపీ బీద మస్తాన్ రావు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:08 PM
తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ, గ్రామస్థులతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
నెల్లూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు (Beeda MastanRao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ, గ్రామస్థులతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) నెల్లూరు జిల్లాలో ఎంపీ బీద మస్తాన్ రావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం దృష్టికి మత్స్యకారుల వివదాన్ని తీసుకెళ్తా..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మత్స్యకారుల వివదాన్ని పరిష్కరిచాలని చేస్తున్న పోరాటానికి, ప్రయత్నాలు చేస్తున్నాయని ఎంపీ బీద మస్తాన్ రావు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కలగజేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సీఎం చంద్రబాబుని కోరానని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజిన్ దృష్డికి ఈ విషయాన్ని తాను తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. మత్స్యకారులకి నిరంతరం సేవ చేసే తనపై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో మత్స్యకారులు, మత్స్యకార గ్రామాల ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు తాను ఎప్పుడూ చేయలేదు, చేయబోనని ఎంపీ బీద మస్తాన్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News