అహోబిలంలో గొడవలకు పోలీసుల వైఫల్యమే కారణం: భూమా అఖిలప్రియ
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:23 PM
పోలీసుల వైఫల్యంతోనే అహోబిలంలో గొడవలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. అహోబిలం సమస్యాత్మక గ్రామమని తెలిపారు.
నంద్యాల జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలీసుల వైఫల్యంతోనే అహోబిలంలో గొడవలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఆరోపించారు. అహోబిలం సమస్యాత్మక గ్రామమని తెలిపారు. ఈరోజు (గురువారం) నంద్యాల జిల్లా వేదికగా మీడియాతో అఖిలప్రియ మాట్లాడారు. గతంలో ఇక్కడ గొడవలు జరిగాయని ప్రస్తావించారు. ఈసారి కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు..
పాత నేరస్థులను కంట్రోల్ చేయాలని తాను పోలీసులకు చెప్పానని.. అయినా వారు ఎందుకు పట్టించుకోలేదని అఖిలప్రియ ప్రశ్నించారు. గొడవలు జరుగుతాయని చెప్పిన తననే పోలీసులు అరెస్టు చేస్తానని అనడం సరైన విధానం కాదని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అహోబిలంలోనే ఉన్నారని తెలిపారు. టీడీపీ మద్దతుదారు ఇంటిపై వైసీపీ మూకలు రాళ్లదాడి చేస్తున్నా, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని అఖిలప్రియ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News