కార్యకర్తే అధినేత... 10 లక్షల మందితో ‘మైటీడీపీ’ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:53 PM
కార్యకర్తే అధినేత.. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం..బలగమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తే అధినేత.. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం.. బలగమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలని పేర్కొన్నారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలని ఆకాంక్షించారు.
ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలి..
పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన మన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలని అన్నారు. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలని కోరుకున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News