మూలా నక్షత్రం వేళ.. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ..
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:34 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు హోల్డింగ్ పాయింట్లు, ఐదు అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాట్లు చేశారు.
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారి జన్మ నక్షత్రం (మూలా నక్షత్రం) కావడంతో దుర్గగుడికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు దర్శనాలను రద్దు చేశారు. మూలనక్షత్రం సందర్భంగా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలను కల్పించారు. ఇవాళ (శుక్రవారం) సాయంత్రం అమ్మవారికి పట్టువస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. గత అనుభవాల నేపథ్యంలో మూడు హోల్డింగ్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.
రోడ్లపై భక్తుల తోపులాట లేకుండా హోల్డింగ్ పాయింట్ల ద్వారా క్యూ లైన్లోకి పోలీసులు పంపిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. ఐదు అంచల భద్రతతో అందరినీ క్యూలైన్లో వెళ్లేలా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో ప్రశాంతంగా ముందుకెళ్తూ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
శ్రీశైలంలో కాత్యాయని అలంకారంలో భ్రమరాంబికాదేవి..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఆరోరోజుకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం కాత్యాయని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివనున్నారు. హంసవాహనంపై ఆసీనులై స్వామి, అమ్మవార్లు ప్రత్యేక పూజలందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News