హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:44 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.
విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు(Gadde Rammohan Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో గురువారం.. పటమటలంక రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనూరాధ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ క్షమాపణ చెప్పాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదని.. ఎందుకలా అవుతోందని చాలామంది తనను అడిగేవారని గుర్తుచేశారు. ఒక్క లడ్డూలోనే కాదని.. అన్నప్రసాదంలోనూ నాడు నాణ్యత లోపించిందన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను జగన్ రెడ్డి దెబ్బతీశారని ఆగ్రహించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుపతి అని.. అక్కడి లడ్డూనే కల్తీ చేయడమనేది మహా పాపమని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: గద్దె అనూరాధ
జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. ఎక్కడా పాలు కొనలేదు.. కానీ నెయ్యి ఎలా తయారైంది.? అని ప్రశ్నించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సిట్ నివేదికలో ప్రస్తావించిందన్నారు. సిట్ నివేదికతో తాము ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. జగన్ హిందువులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారామె.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News