Home » Panchumarthi Anuradha
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కిల్లర్, క్రిమినల్, మాఫియా పార్టీలకు అధ్యక్షుడని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అభివర్ణించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ నగర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. 2014లోనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
MLC Anuradha: జగన్ హయాంలో కార్మికులను పట్టించుకోలేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.
Panchumarthy Anuradha: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.