Share News

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:27 PM

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.


గత ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికార వైయస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ జాబితాలో నెల్లూరు జిల్లా కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా తెర మీదకు తీసుకు వచ్చారు. అయితే అంతే అనూహ్యంగా అమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ హఠాత్పరిణామాన్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసలు ఉహించలేదు. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి.. తన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేశారు.


దీంతో వారంతా టీడీపీలో చేరిపోయారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దాంతో జిల్లాలోని తడ నుంచి అటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు అధికార ఫ్యాన్ పార్టీలో ఏదో ఒక నియోజకవర్గంలో ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ.. ఏదో ఒక సమయంలో అసమ్మతి రాగం పుడుతూనే ఉంది.

ఆ అసమ్మతి రాగానికి తాళం వేసినట్లు.. నెల్లూరు జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడి.. అటు టీడీపీలో లేకుంటే ఇటు జనసేన పార్టీల్లో చేరిపోయారు. అందుకు నెల్లూరు జిల్లాలోని కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరితే.. ఇక బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. వీళ్లు ఇలా పార్టీలో చేరి.. అలా ఎన్నికల బరిలో నిలిచారు.


మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకొనేందుకు గులాబీ బాస్ కేసీఆర్ చేసి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అయితే అందులో ఆయన చేసిన తొలి తప్పిందం.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకుండా.. పాత వారినే బరిలోకి దింపారు. ఇక టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో కేసీఆర్ నీకు దమ్ముంటే అభ్యర్థులను మార్చకుండా బరిలో దింపాలంటూ సవాల్ విసిరేవారు. కేసీఆర్ అలాగే చేయడంతో.. ఆ పార్టీనే కాదు.. కేసీఆర్ సైతం అధికారానికి దూరమయ్యారు.

అనంతరం కేసీఆర్‌తో సీఎం జగన్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత.. సీఎం వైయస్ జగన్ భేటీ కావడం.. కారు పార్టీ ఓటమిపై ప్రశ్నించడం.. అందులో అభ్యర్థులను మార్చకుండా బరిలో దిగడం కూడా కారణమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత సీఎం వైయస్ జగన్.. వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. దీంతో ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు ఆ పార్టీ వీడడానికి ఇదో ముఖ్య కారణమైంది. అంటే నాడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏర్పడిన అసమ్మతి అనే అల్పపీడనం.. కాస్తా వాయుగుండంగా మారి.. ఇతర జిల్లాకు విస్తరించిందని... దీంతో వైసీపీ ఓటమి అంచుకు చేరిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా తమదైన శైలిలో వివరిస్తున్నారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 03:23 PM