సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కాల్.. రూ.1.43కోట్లు కాజేసిన కేటుగాళ్లు
ABN , Publish Date - Aug 06 , 2026 | 07:22 PM
మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.
కృష్ణాజిల్లా, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు (Machilipatnam Cyber Fraud) మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు. గత రెండు నెలలుగా ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ‘మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుకున్నారు’ అంటూ వృద్ధురాలిని వాట్సాప్ కాల్‌లో బెదిరించారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడారు. ఆస్తులు, అకౌంట్లలోని డబ్బులను కోర్టుకు అటాచ్ చేయాలని నేరగాళ్లు నమ్మబలికారు. దీంతో మూడు విడతలుగా తన అకౌంట్‌లోని రూ.1.43కోట్ల నగదును వృద్ధురాలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆస్తులు కూడా అమ్మి నగదు జమ చేయాలని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. భయంతో వెంటనే స్థానిక పోలీసులను వృద్ధురాలు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News