Share News

ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగు ఉధృతిపై ఏబీఎన్‌ కథనం.. స్పందించిన కలెక్టర్

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:54 PM

ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉధృతిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీషా స్పందించారు. ఈ క్రమంలోనే గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగు వరద ఉధృతిని పరిశీలించి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగు ఉధృతిపై ఏబీఎన్‌ కథనం.. స్పందించిన కలెక్టర్
Kattaleru Vagu Flood News

ఎన్టీఆర్ జిల్లా, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉధృతిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీషా స్పందించారు. ఈ క్రమంలోనే గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగు వరద ఉధృతిని పరిశీలించి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. గత రెండు రోజుల నుంచి మురస్ తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో రెండు చోట్ల వాగు ఉధృతితో రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు.

Kattaleru-Vagu-Flood-News-2.jpg


ముఖ్యంగా రేపు (గురువారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నిన్న(మంగళవారం) కురిసిన వర్షాలతో నీటి నిల్వల సామర్థ్యం పెరిగినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాల వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు.

Kattaleru-Vagu-Flood-News-.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:23 PM