స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:12 PM
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
విజయవాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదని అధికారులను ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ తప్పనిసరి అని తేల్చిచెప్పారు.
ఈరోజు (శుక్రవారం) విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీడీ ఎమ్ఏ డాక్టర్. పి.సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు కమిషనర్లు, డీఐజీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులు, తదుపరి విడత ఎన్నికల సన్నద్ధత, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఏపీ ఎస్‌ఈసీ సమీక్షించారు.
ఎన్నికల ప్రారంభ దశలో ఏడు జిల్లాల్లో జరిగిన ఘటనలు చోటుచేసుకోవడంతో పలు ఫిర్యాదులు తమకు అందాయని ఏపీ ఎస్‌ఈసీ చెప్పారు. నామినేషన్ల దాఖలు చేయడానికి ఆటంకాలు కల్పించడం, అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News