Share News

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: అయ్యన్నపాత్రుడు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:45 PM

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జగన్ అండ్ కో అడ్డుపడటం భావ్యం కాదని పేర్కొన్నారు.

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి: అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu

ఎన్టీఆర్ జిల్లా, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సూచించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జగన్ అండ్ కో అడ్డుపడటం భావ్యం కాదని పేర్కొన్నారు. వైసీపీ ప్రతిదానికి అడ్డంకిగా ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని అయ్యన్నపాత్రుడు కుటుంబం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం బాగుంటేనే పార్టీలైన, ప్రజలైన బాగుంటారని చెప్పుకొచ్చారు. అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుందని వివరించారు.


ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి తాను సేవలందించానని.. ఇప్పటి నుంచి తన కుమారుడికి సేవలు అందించే అవకాశం రావడం సంతోషకరమని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నందుకు తగిన గుర్తింపు లభించిందని అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్.. తమ కుటుంబంపై ఉంచిన గురుతర బాధ్యతను పార్టీకి అంకితం చేస్తున్నామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 04:49 PM