Share News

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:37 PM

జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్షకు ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిర్దేశించారు.


ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలి..

రాష్ట్ర- క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం 3.5 రేట్ల మేర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్‌లో ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.


డ్రివెన్ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు.. సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ పెంపుదల చేసేందుకు శ్రద్ధ పెట్టాలని మార్గనిర్దేశం చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు మల్టీప్లైయర్ ఎఫెక్ట్ వచ్చేలా చర్యలకు సూచించారు. కేపీఐలు మెరుగ్గా ఉంటే... వృద్ధి రేటు పెరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 07:43 PM