ఉమ్మడి కడప జిల్లాలో నామినేషన్ల పర్వంలో ఉద్రిక్తత పరిస్థితులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:03 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లకు తెగబడేందుకు వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను గొడ్డలి పార్టీ నేతలు దింపినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లకు తెగబడేందుకు వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను గొడ్డలి పార్టీ నేతలు దింపినట్లు తెలుస్తోంది. పంజాబ్ నుంచి మారణాయుధాలతో సహా నేరగాళ్లను జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు దింపినట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు మారణాయుధాలతో క్రైమ్ ముఠాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న(శుక్రవారం) రాయచోటిలోని నామినేషన్ కేంద్రం వద్ద గొడ్డలి పార్టీ గ్యాంగ్ హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే.
పెద్దఎత్తున హింసాకాండకు పాల్పడేలా..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దఎత్తున హింసాకాండకు పాల్పడేలా ముఠాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. లైసెన్సులేని తుపాకులు, అక్రమ ఆయుధాలతో ప్రజలను భయకంపితులను చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయచోటిలో రెండు తుపాకులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న 10 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
గాంధీనగర్ స్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
మరోవైపు.. ఉమ్మడి కడప జిల్లాలో నామినేషన్ల పర్వంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బరితెగించి గొడవలకు వైసీపీ శ్రేణులు దిగుతున్నట్లు సమాచారం. కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ కార్యకర్తలపై కారంపొడి జల్లి రాళ్ల దాడులకు వందలాదిమంది వైసీపీ శ్రేణులు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజంపేటలో కర్రలు రాళ్లతో నామినేషన్ కేంద్రానికి వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వర్గీయులు వచ్చారు. ఈ క్రమంలో వీరిని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే, రాయచోటిలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఎమ్మిగనూరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠం చిచ్చు..
కర్నూలు జిల్లాలోని వైసీపీ ఎమ్మిగనూరులో మున్సిపల్ చైర్మన్ పీఠం చిచ్చు రేపింది. వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. రాజీవ్ రెడ్డి వర్సెస్ బుట్టా రేణుక వర్గంగా విడిపోయారు. వైసీపీ అధికారిక ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ రఘు నామినేషన్ దాఖలు చేశారు. బుట్టా రేణుక వర్గం నుంచి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి నజీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
చిత్తూరులో 144 సెక్షన్..
చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు.
మదనపల్లెలో..
మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడేందుకు టీడీపీ, వైసీపీ నాయకులు వచ్చారు. వీరిని అక్కడినుంచి పోలీసులు దూరంగా పంపివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News