రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్
ABN , Publish Date - Jan 26 , 2026 | 10:01 PM
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు..
ఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు. సోమవారం ఇందిరాభవన్‌లో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షర్మిల హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం తెలియదు ,రాజ్యాంగాన్ని గౌరవించడం రాదని మండిపడ్డారు.
అంబేడ్కర్‌ను అవమానించారు..
నిండు సభలో మహాత్మా గాంధీని, అంబేడ్కర్‌ను అవమానించారని షర్మిల ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం , సోదరభావం కోసం రాహుల్ గాంధీ 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని ప్రస్తావించారు. దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు చూస్తారని చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూస్తామని తెలిపారు. ఈరోజు కొన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే అజెండాగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఏపీలో కాంగ్రెస్ బలోపేతం...
ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఆమె మాట్లాడుతూ... ‘త్వరలో ఉపాధి హామీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. MGNREGA యథావిధిగా కొనసాగించాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఉంటుంది. డీసీసీ నియామకాల్లో ఏపీలోనే కాదు దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా అధ్యక్షులు పని చేయకపోతే వెంటనే తొలగిస్తాం’.. అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..
బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News