Share News

సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 08 , 2026 | 11:01 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Telangana CM Revanth Reddy Birthday Wishes

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) జన్మదినం నేడు. ఆయనకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, తదితరులు రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు.


రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు.


సుదీర్ఘమైన, పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలి: ఓం బిర్లా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, సుదీర్ఘమైన, పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓం బిర్లా పేర్కొన్నారు.


రాబోయే ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం లభించాలని కోరుకుంటున్నాను. రాబోయే ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలి: లోకేశ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.‘ మీరు మంచి ఆరోగ్యం, ఆనందంతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము’ అని లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 11:59 AM