రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - May 28 , 2026 | 01:25 PM
మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం ఓ పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్ సేవలు మరువలేనివి..
‘కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని రాజకీయ జీవితంలోకి వచ్చి- ప్రజాపక్షం వహించిన దివంగత నేత ఎన్టీరామారావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందించిన సేవలు మరువలేనివి. ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రూ.2లకే కిలోబియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News