Share News

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. తెలుగు తమ్ముళ్లకు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:58 AM

టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్‌లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. తెలుగు తమ్ముళ్లకు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం
Palla Srinivasa Rao

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలుగు తమ్ముళ్లకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పలు కీలక సూచనలు చేశారు. మంగళవారం టీడీపీ నేతలతో పల్లా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.


వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ పార్టీ నేతల ట్రాప్‌లో పడొద్దని మార్గనిర్దేశం చేశారు. ప్లాన్ ప్రకారమే రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పమన్నారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 09:09 AM