టీడీపీ కేడర్‌ను మరింత అనుసంధానం చేసేందుకే ఈ లీడర్ షిప్ కాంక్లేవ్: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:11 AM
నాయకులకు, కార్యకర్తలను మరింత అనుసంధానం చేసేందుకు ఈ లీడర్ షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రెండు రోజులు పాటు ఉదయం నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ కాంక్లేవ్ జరుగుతుందని వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు ఈ వర్క్‌షాప్ జరగనుంది. ఈ శిక్షణ తరగతుల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పాల్గొని కేడర్‌కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. నాయకులకు, కార్యకర్తలను మరింత అనుసంధానం చేసేందుకు ఈ లీడర్ షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ కాంక్లేవ్ జరుగుతుందని వెల్లడించారు. మొత్తం 10 సెషన్లలో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పుకొచ్చారు.
స్థానిక ఎన్నికలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సి ఉందని.. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలను కూడా ఈ సమావేశాలకు పిలిచామని.. వారు కూడా ఈ కాంక్లేవ్‌లో పాల్గొంటారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కాగా, ఈ లీడర్ షిప్ కాంక్లేవ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. అసెంబ్లీ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు
వంగవీటి రాధాను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News